గత సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయిన వన్ ప్లస్ ప్యాడ్ కు తర్వాత తరం వెర్షన్ గా వన్‌ప్లస్ ప్యాడ్ 2 విడుదల త్వరలో కానుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత OS ను కలిగి ఉంటుందని, 8GB ర్యామ్‌ను, క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్ 2 ఈ సంవత్సరం రెండో భాగంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్యా్డ్ 2 తోపాటు వన్‌ప్లస్ వాచ్ 3 కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానున్నాయనే సమాచారాన్ని వెల్లడించలేదు. ఒప్పో ప్యాడ్ 3 తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒప్పో ప్యాడ్ 12.1 అంగుళాల 3k LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుందని సమాచారం. ఈ ట్యాబ్లెట్ 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీని కలిగి ఉంటుందని సమాచారం.
0 Comments