దేశీయ మార్కెట్లో రెడ్ మీ నోట్ 14 రిలీజ్ ను విడుదల చేసేందుకు ఎమ్ఐ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్ 50 మెగా ఫిక్సలతో పెద్ద ప్రైమరీ సెన్సార్ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ వెనకవైపు చూసినట్లయితే ఫోటో కెమెరా లేదని చెబుతున్నారు. అలాగే రెడ్ మీ నోట్ 13 ప్రో మాదిరిగా ఈ ఫోన్ మధ్యలో హోల్ పంచ్ కటౌట్ తో 1.5 కే రిజల్యూషన్ డిస్ ప్లే ను అందిస్తున్నారు. అయితే ఈ డిస్ ప్లే డ్యూయల్ మైక్రో కార్వ్డ్ స్క్రీన్ అని తెలుస్తోంది. అయితే రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో వస్తుంది. అదేవిధంగా పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో అందుబాటులో ఉంటుంది.ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన రెడ్ మీ నోట్ 13 ఫోన్ రూ.25,999 మార్కెట్లోకి రాగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ ఫోన్ 6.67 అంగుళాలు 1.5 కే ఏమో ఎల్ఈడి స్క్రీన్ తో రావడం జరిగింది . అలాగే ఈ ఫోన్ 12gb ర్యామ్ స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 2 చిప్ ద్వారా పనిచేస్తుంది.
0 Comments