Ad Code

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల !


మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఓ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తోంది. ఇది రిలీజ్ అయితే పీసీల నుంచి ఫైల్స్‌, లింక్స్‌, తదితర డేటా కంటెంట్స్ ఆండ్రాయిడ్ డివైజ్‌లకు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఈ కొత్త ఫీచర్‌తో విండోస్ 11 షేర్ మెనూకు ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను షార్ట్‌కట్‌గా జోడిస్తుంది. 'మై ఫోన్' అనే పేరుతో యూజర్ ఫోన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు ఈజీగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను ఇప్పుడే రిలీజ్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చేలోపు కాస్త ఆలస్యం కావచ్చు. దీనిని ఉపయోగించడానికి, యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్లలో లింక్ టు విండోస్ యాప్, పీసీలో ఫోన్ లింక్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఫోన్, పీసీలో ఈ రెండు అప్లికేషన్లు ఉపయోగించి, రెండింటినీ పెయిర్ చేయాలి. తర్వాత స్మార్ట్‌ఫోన్ విండోస్ షేర్ మెనూలో "మై ఫోన్" ఐకాన్‌గా కనిపిస్తుంది. దీనికి కంటెంట్‌ను షేర్ చేసుకోవచ్చు. "కస్టమర్లకు ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. దీనితో విండోస్ PC నుంచి ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ఫైల్స్‌, లింక్స్‌, ఇంకా మరెన్నో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లో "లింక్ టు విండోస్", పీసీలో "ఫోన్ లింక్" యాప్స్ డౌన్‌లోడ్ చేసి, డివైజ్‌లను పెయిర్ చేయాలి." అని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌తో ఫైల్స్‌ను మరింత ఈజీగా, ఫాస్ట్‌గా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ షేరింగ్‌ను నేరుగా విండోస్ షేర్ మెనూకు జోడిస్తుంది. ఇంతకు ముందు, యూజర్లు ఫైల్స్‌ను షేర్ చేసుకోవడానికి ఇతర పద్ధతులను ఉపయోగించాల్సి వచ్చింది, వాటి వల్ల చాలా టైమ్‌ వేస్ట్ అయ్యేది. ఎక్కువ రిస్క్ కూడా ఉండేది. కానీ ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. కొత్త డేటా షేరింగ్ ఫీచర్ అన్ని యాప్స్‌తో సరిగ్గా పని చేయకపోవచ్చు. దీనికి కారణం, చాలా విండోస్ యాప్స్‌, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదా అడోబ్ ఫోటోషాప్ వంటి వాటికి సొంత స్పెషల్ షేర్ మెనూలు ఉంటాయి. ఈ స్పెషల్ షేర్ మెనూలు విండోస్ 11 షేర్ మెనూతో కంపాటబుల్‌గా ఉండకపోవచ్చు, ఇది డేటా షేరింగ్ ఫీచర్ పనిచేయడానికి అవసరం. ఉదాహరణకు పీసీ నుంచి మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోని డాక్యుమెంట్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌కు షేర్ చేయాలని అనుకుందాం. వర్డ్‌కు స్పెషల్ షేర్ మెనూ ఉంటే, డేటా షేరింగ్‌ ఫీచర్ ఆ మెనూను యాక్సెస్ చేయలేకపోవచ్చు, దీనివల్ల డాక్యుమెంట్‌ను కొత్త ఫీచర్‌తో షేర్ చేయడం కుదరదు. అయితే, ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ వంటివి విండోస్ 11 షేర్ మెనూను ఉపయోగిస్తాయి, వల్ల వాటి నుంచి ఫైల్స్ షేర్ చేయడం కుదురుతుంది.


Post a Comment

0 Comments

Close Menu