చాట్‌జీపీటీని విడుదల చేసిన ఓపెన్ AI సంస్థ తాజాగా LLM GPT- 4 అప్ డేట్ వెర్షన్‌ను GPT-4o ను విడుదల చేసింది. ఇందులో o అంటే ఓమ్నీగా (Open AI GPT-4o) పేర్కొంది. త్వరలో ఇది అందరికి ఉచితంగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఓపెన్ ఏఐ GPT- 4o లో వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉంటాయి. అయితే ఉచితంగా వినియోగించుకొనే వారికి లిమిటెడ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని అదే ప్రీమియం యూజర్లు అన్ లిమిటెడ్ యాక్సెస్ ను పొందవచ్చని సంస్థ తెలిపింది. GPT-4 టర్బో కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఈ GPT-4o సుమారు 50 భాషలను సపోర్టు చేస్తుందని ఓపెన్ ఏఐ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాళీ వంటి భారతీయ భాషలను సపోర్టు చేయనుంది. GPT-4o వాయిస్ కమాండ్లను కేవలం 232 మిల్లిసెకన్లలోనే సమాధానాలు ఇస్తుందని సంస్థ తెలిపింది. తన కొత్త ఏఐ మోడల్ GPT -4o వేగవంతమైన, ఇంటెలిజెంట్ మరియు మల్టీ మోడల్‌గా లాంచ్ అయిందని ఓపెన్ ఏఐ శామ్ ఆల్టమన్ తెలిపారు. ప్రతి చాట్‌జీపీటీ యూజర్‌లు ఉచితంగా దీనిని వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే GPT-4 మాత్రం ప్రస్తుతానికి డబ్బులు చెల్లించిన వారు మాత్రమే వినియోగించుకొనేందుకు అందుబాటులో ఉందని చెప్పారు. MacOS వినియోగదారుల కోసం డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఒపెన్ ఏఐ వెల్లడించింది. రానున్న రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది. కొత్త ఏఐ మోడల్ GPT- 4o ఫీచర్లు సహా స్పెసిఫికేషన్లపై ఓపెన్ ఏఐ సంస్థ తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ఆడియో, విజన్ మరియు టెక్ట్స్ కోసం GPT-4o ఎండ్ టూ ఎండ్ తో కొత్త మోడల్‌కు శిక్షణ ఇచ్చింది. ఈ నెట్‌వర్క్ అన్ని అవుట్‌పుట్ మరియు ఇన్‌పుట్‌లను నిర్వహిస్తుంది. దీంతోపాటు ఈ కొత్త మోడల్‌కు సంబంధించి ఓపెన్ ఏఐ మోడల్ కొన్ని వీడియోలనూ కూడా పోస్ట్ చేసింది.
0 Comments