ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్‌తో మరింత బెటర్‌గా ఎంగేజ్ అయ్యేందుకు వీలుగా నాలుగు కొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. క్రియేటర్ల పోస్ట్‌లపై ఫాలోవర్స్‌లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు 'రివీల్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాలో స్టోరీ పెట్టేటప్పుడు లొకేషన్, హ్యాష్‌ట్యాగ్, అవతార్.. వంటి పలు ఆప్షన్లతో పాటు ఇప్పుడు కొత్తగా 'రివీల్' అనే ఆప్షన్ కూడా కనిపించబోతోంది. రివీల్ ఆప్షన్ ఎంచుకుంటే ఫాలోవర్లకు డైరెక్ట్‌గా పోస్ట్ కనిపించదు. 'మెసేజ్ టు రివీల్' అని వస్తుంది. ఆ పోస్ట్‌కు సంబంధించిన ఏదైనా హింట్ లాంటిది మెసేజ్ బాక్స్‌లో టైప్ చేస్తే అప్పుడు పోస్ట్ రివీల్ అవుతుంది. షేక్ చేస్తే ఫొటో కనిపించేలా మరో ఫీచర్‌ను కూడా యాడ్ చేసింది ఇన్‌స్టాగ్రామ్. క్రియేటర్లు ఫ్రేమ్స్ ఆప్షన్ ద్వారా పోస్ట్ చేసి.. 'షేక్ టు రివీల్' ఆప్షన్ ద్వారా షేక్ చేస్తే ఫొటో రివీల్ అయ్యేలా స్టోరీ పెట్టుకోవచ్చు. స్టోరీని ఫాలోవర్లు చూడాలంటే మొబైల్‌ను షేక్ చేయాల్సి ఉంటుంది. క్రియేటర్ల స్టోరీకి ఫాలోవర్లు తమ సొంత మ్యూజిక్‌ను యాడ్ చేసుకునేలా మరో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్. క్రియేటర్ల పోస్ట్ లేదా స్టోరీని చూసేటప్పుడు కింద కనిపించే 'యాడ్ యువర్స్' ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా.. ఫాలోవర్లు ఆ పోస్ట్‌కు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. నచ్చిన ఫొటోను స్టికర్‌గా మార్చుకునేందుకు వీలుగా 'కటౌట్స్' అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్. స్టోరీ పోస్ట్ చేసేటప్పుడు స్టిక్కర్ ఐకాన్‌లో కనిపించే 'కటౌట్స్' ఆప్షన్ ఎంచుకుంటే.. అప్పుడు గ్యాలరీ కనిపిస్తుంది. అక్కడ ఫొటో సెలక్ట్ చేసుకుని దాన్ని కటౌట్ స్టికర్‌గా మార్చుకోవచ్చు.
0 Comments