ఓ బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనుకోకుండా ఇంట్లో స్విచ్ బోర్డు దగ్గర మంట రాగా ఆ బాలుడు తన సమయస్ఫూర్తితో పెను ప్రమాదం నుండి బయట పడేశాడు. వీడియోలో ఓ బాలుడు ఒక్కడే టీవీ చూస్తున్నాడు. మిగతా కుటుంబ సభ్యులందరూ కాస్త దూరంగా కూర్చొని తింటుంటారు. అయితే పిల్లవాడు టీవీ చూస్తున్న సమయంలో ఒక్కసారిగా స్విచ్ బోర్డు దగ్గర పెద్దగా మంటలు వచ్చాయి. దానితో అతడు వెంటనే తన కుటుంబ సభ్యుడి దగ్గరికి వెళ్లి అక్కడ విషయం చెప్పి అక్కడకు రమ్మని చేయి పెట్టి లాగిన అతడు వినకుండా పార్టీలో మునిగిపోయాడు. అయితే ఆ బాలుడు వెంటనే సమయస్ఫూర్తితో టీవీ కింద ఉన్న ఓ స్ప్రే ని ఉపయోగించి మంటలపై స్ప్రే చేశాడు. దీంతో మంటలు అదుపులోకి వచ్చింది. దీంతో నిజంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ వైరల్ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులపై భిన్నాభిప్రాయాలు కామెంట్ చేస్తున్నారు. వారు తల్లిదండ్రుల పోస్టుకి పనికిరారంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరైతే ఆ పిల్లాడి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.
0 Comments