తమిళనాడు లోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం గిరివలయం రోడ్డులో తమిళ వైకాసి మాస పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది. అరుణాచలేశ్వరాలయంలో ప్రతినెలా పౌర్ణమి రోజున భక్తు లు అధిక సంఖ్యలో గిరివలయం రోడ్డులోని 14 కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా పౌర్ణ మి బుధవారం సాయంత్రం ప్రారంభమై గురువా రం సాయంత్రం వరకు ఉండడంతో ఆ సమయంలో గిరివలయం వెళ్లాలని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. అలాగే కార్తీక దీపం తరహాలోనే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ జాయింట్ కమిషనర్ జ్యోతి అధ్యక్షతన ఆలయంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అలాగే ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. ఇదిలా ఉండగా పౌర్ణమి సమయంలో 14 కిలోమీటరు దూరంలో ఉన్న గిరివలయం రోడ్డులో కాలి నడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందని భావించిన భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తిరువణ్ణామలై చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.
0 Comments