Ad Code

ఓపెన్ఏఐ సూపర్ అలైన్‌మెంట్ లీడ్ జాన్ లీకే రాజీనామా !


పెన్ఏఐ టాప్ ఎగ్జిక్యూటివ్, కంపెనీ సూపర్ అలైన్‌మెంట్ లీడ్ జాన్ లీకే తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీలో భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తితో ఆయన ఓపెన్ఏఐని వీడారు. మే 14న జాన్ లీకే రాజీనామాతో కంపెనీలో ఏఐ పరిశోధన, అభివృద్ధిలో కీలక దశకు తెరపడినట్లయింది. కంపెనీ నుంచి బయటపడుతూ తాను తీసుకున్న నిర్ణయం ఏమంత సులభం కాదని వరస ట్వీట్లలో జాన్ వెల్లడించారు. గత మూడేండ్లుగా తన బృందం ఇన్‌స్ట్రక్ట్‌ జీపీటీ ట్యాంగ్వేజ్ మోడల్‌ను లాంఛ్ చేయడంతో పాటు ఎల్ఎల్ఎంల విషయంలో పురోగతికి జాన్ లీకే మార్గదర్శకత్వం వహించారు. సూపర్ ఇంటెలిజెంట్ టీంలో ఎంతో నైపుణ్యం కలిగిన సహచరులతో పని చేశానని, తన టీంను ఎంతో ప్రేమిస్తానని జాన్ ట్వీట్ చేశారు. జాన్ లీకే నిష్క్రమణ కంపెనీ సాగుతున్న దిశపై ఆందోళన రేకెత్తిస్తోంది. సంస్థ ప్రధాన ప్రాధాన్యతల గురించి ఓపెన్ఏఐ యాజమాన్యంతో కొనసాగుతున్న విభేదాలను ఆయన వెల్లడించారు. మనకంటే చాలా తెలివిగా ఏఐ సిస్టమ్‌లను ఎలా నడిపించాలో, నియంత్రించాలో మనం తక్షణమే గుర్తించాలని అన్నారు. తదుపరి జనరేషన్ ఏఐ మోడల్స్‌, భద్రత, పర్యవేక్షణ, సంసిద్ధత, సేఫ్టీ, అలైన్‌మెంట్‌, గోప్యత, సమాజంపై ప్రభావం వంటి అంశాలపై పూర్తిస్ధాయిలో దృష్టిసారించాలని సూచించారు. ఇంతటి కీలకమైన అంశాలపై కంపెనీ సరైన దృష్టిని, వనరులను కేంద్రీకరించకపోవడం విచారకరమని జాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిశగా కంపెనీ ప్రస్ధానం సరైన దిశగా సాగడం లేదని తాను భావిస్తున్నానని అన్నారు. తమ పరిశోధనకు అవసరమైన వనరులను సాధించడంలో తమ టీం సవాళ్లను ఎదుర్కొన్నదని గుర్తుచేశారు.

Post a Comment

0 Comments

Close Menu