మైక్రోసాఫ్ట్ కొత్తతరం పర్సనల్ కంప్యూటర్లు ఆవిష్కరించింది. కోపైలట్+ పీసీల అనే పేరుతో వీటిని తీసుకొస్తున్నది. ఇంత వరకూ ఆవిష్కరించిన పర్సనల్ కంప్యూటర్లతో పోలిస్తే ఈ పర్సనల్ కంప్యూటర్లు అత్యంత శక్తిమంతమైనవి, వేగవంతమైనవని మైక్రోసాఫ్ట్ తెలిపింది. స్నాప్ డ్రాగన్ ఎక్స్ సిరీస్ ప్రాసెసర్లతో కోపైలట్+ పీసీలను తయారు చేసింది. సెకన్ కు 40 లక్షల కోట్ల ఆపరేషన్స్ పూర్తి చేయడం వీటి స్పెషాలిటీ. వీడియో ఎడిటింగ్, క్లిష్టమైన డేటా అనాలసిస్, మల్టీపుల్ ప్రోగ్రామ్స్ రన్ వంటి పనుల్లో వేగంగా స్పందిస్తాయీ పర్సనల్ కంప్యూటర్లు.. దీర్ఘకాలిక లక్ష్యమైన ఏఐ పీసీల అభివ్రుద్ధిలో భాగంగా వీటిని ఆవిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా ఈ ఫీచర్లను వాడుకోవాలంటే అందుకు మద్దతునిచ్చే హార్డ్ వేర్ కూడా ఉండాలి. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో ఎసెర్, అసుస్, డెల్, హెచ్ పీ, లెనోవో, శాంసంగ్ వంటి సంస్థలు జత కట్టాయి. వచ్చేనెల 18 నుంచి కోపైలట్ + పీసీలు తెస్తాయి. మైక్రోసాఫ్ట్ కూడా ఈ క్యాటగిరీలో సర్ఫేస్ పేరుతో డివైజ్‌లు విడుదల చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ + పీసీల్లో రీకాల్ అనే ఏఐ ఫీచర్ ఉంటది. దీంతో ఈ పీసీలో ఏ సమాచారమైనా వెంటనే పొందొచ్చు. ఫైల్, ఫోల్డర్, ఈ-మెయిల్ గుర్తించడంతోపాటు గతంలో మీరు పూర్తి చేసిన యాక్షన్లు, హిస్టరీ మీ ముందు నిలుపుతుంది. రిషేషన్ షిప్, అసోసియేషన్ల ఆధారంగా ఈ పీసీలు సమాచారం సేవ్ చేస్తాయి. ఈ పర్సనల్ కంప్యూటర్లలో కోక్రియేట్ అనే ఏఐ ఫీచర్ ఉంటుంది. ఇది పెయింట్, ఫొటోస్ వంటి యాప్స్‌తో పని మెరుగు పరుస్తుంది. పెయింట్‌లో ఒక బొమ్మ గీస్తే.. ఏఐ కూడా తనంతటతానుగా మరో బొమ్మ గీసి చూపుతుంది. దాన్ని మనం టెక్ట్స్ కమాండ్‌లతో మెరుగు పరిచి వినియోగించుకోవచ్చు. పెయింట్ లోనూ ఫోటోను ఏఐ టూల్స్ ఎడిట్ చేసే సౌకర్యం ఉంటది. అడోబ్, క్యాప్ కట్, డావిన్సీ రిసాల్వ్ స్టూడియో, సెఫబుల్, లిక్విడ్ టెక్ట్స్ వంటి యాప్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ జత కట్టింది. తద్వారా ఆయా యాప్‌లతో ఏఐ ఫీచర్లు అనుసంధానించింది.
0 Comments