ఎలన్ మస్క్ ఎక్స్ యూఆర్ఎల్ మారిందంటూ ట్వీట్ చేశారు. కేవలం ఎక్స్ వెబ్‌సైట్ మాత్రమే కాదు.. అన్ని కోర్ సిస్టమ్స్ ఇప్పుడు (x.com)లో మారాయని మస్క్ ప్రకటించారు. ఎక్స్ యూజర్లు ఎవరైనా ట్విట్టర్ (twitter.com) యూఆర్ఎల్‌తో సెర్చ్ చేస్తే అది ఇప్పుడు x.comకి రీడైరెక్ట్ అవుతుంది.. కొత్త X లాగిన్ ఇప్పుడు కంపెనీ URLని రీడైరెక్ట్ అవుతుందని తెలిపే మెసేజ్ కూడా డిస్‌ప్లే అవుతుంది. అయితే, ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ చెక్కుచెదరకుండా అలానే ఉంటుందని కంపెనీ చెబుతోంది. 2022 తర్వాత మస్క్ ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్లాట్‌ఫారంలో ట్వీట్‌ల పేరును పోస్ట్‌లుగా మార్చారు. అంతేకాదు.. యూజర్లను ట్వీట్ బదులుగా పోస్ట్‌లు అని పిలవాలని ప్రోత్సహించాడు. అప్పుడే ట్విట్టర్ అధికారిక లోగో 'X'గా మారింది. కంపెనీ రీబ్రాండింగ్, మొబైల్ యాప్, సబ్‌స్క్రిప్షన్ ఆధారిత విధానంతో సహా అనేక వివరాలను మార్చేశాడు మస్క్. కానీ, ఇప్పటివరకూ ప్లాట్‌ఫారమ్ యూఆర్ఎల్ మార్చలేదు. ఎట్టకేలకు ఎక్స్ అధికారిక్ యూఆర్ఎల్ గా మార్చేసినట్టు ప్రకటించాడు. అంతేకాదు.. బ్లూ కలర్ సర్కిల్‌పై వైట్ (X)తో ఉన్న లోగోను కూడా మస్క్ పోస్ట్ చేశాడు. లోగో రెండు బ్లూ కలర్లతో ఉంది.
0 Comments