పూణే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఐవూమీ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఈవీ స్కూటర్ ధర రూ. 80వేలుగా ఎక్స్-షోరూమ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 170 కిమీల పరిధితో వస్తుందని, మూడు వేరియంట్లలో రానుంది. ఈవీ నార్డో గ్రే, ఉత్రా రెడ్, అర్బన్ గ్రీన్ వంటి వాటితో 8 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలియజేస్తుంది. జీట్‌ఎక్స్ జేఈ 2.1కిలోవాట్ పీక్ పవర్ బీఎల్‌డీసీ మోటారుతో 3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ కాంబోలో ఈవీ స్కూటర్ గంటకు 57కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. నగర వీధుల్లో రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5.5 గంటలు సమయం పడుతుంది. అయితే 50 శాతం బ్యాటరీ ఛార్జ్ 2.5 గంటలలోపు పూర్తి అవుతుంది. 7ఎ హోమ్ వాల్ సపోర్టుతో ఛార్జర్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీ ఐదేళ్లు లేదా 50వేల కిమీల వారంటీతో వస్తుంది.ముందువైపు 75ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు 60ఎమ్ఎమ్ స్ప్రింగ్ లోడ్ యూనిట్ కలిగి ఉంది. వీల్‌పై డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ యూనిట్ నుంచి స్టాపింగ్ పవర్ వస్తుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ, జియో-ఫెన్సింగ్ ఉన్నాయి. డిస్టెన్స్-టు-ఎంప్టీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఎస్ఎంఎస్ కాల్ అలర్ట్‌లతో బ్లూటూత్ కనెక్టివిటీకి ఇన్ఫోగ్రాఫిక్స్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా పొందుతుంది.
0 Comments