ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లే దిక్కు. మొబైల్ గేమింగ్ మార్కెట్‌లో అతి పెద్ద గేమింగ్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్‌ది మాత్రం వెనుకంజే. ఇప్పుడీ కంపెనీ సొంత మొబైల్ గేమింగ్ స్టోర్‌ను ప్రారంభించబోతోంది. ఎక్స్‌బాక్స్ మొబైల్ గేమింగ్ స్టోర్ ద్వారా గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ టెక్నాలజీ సమ్మిట్‌లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎక్స్‌బాక్స్ ప్రెసిడెంట్ సారా బాండ్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని పంచకున్నారు. మైక్రోసాఫ్ట్‌కే చెందిన క్యాండీ క్రష్, మైన్ క్రాఫ్ట్ వంటి గేమింగ్ యాప్స్‌తో తొలుత వెబ్ ఆధారిత గేమింగ్ స్టోర్‌ను లాంచ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది జులైలో ఈ యాప్ స్టోర్ అందుబాటులోకి రానుందని చెప్పారు. తరవాత ఇతర పబ్లిషర్లకు చెందిన గేమ్స్‌ను కూడా వేదిక పైకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఏ డివైజ్ అయినా, ఏ దేశానికి చెందినవారైనా సులువుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్ స్టోర్‌ను తీసుకొస్తున్నామని బాండ్ చెప్పారు. ప్రస్తుతం గూగుల్, యాపిల్ కంపెనీలు యాప్ డెవలపర్ల నుంచి 30 శాతం వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. దీంతో గేమ్ డెవలపర్లు పెదవి విరుస్తున్నారు. దీన్ని తనకు అవకాశంగా మలుచుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఇందులోభాగంగానే యాప్ స్టోర్‌ను లాంచ్ చేయబోతోంది. గూగుల్, యాపిల్‌ను కాదని గేమర్లను ఆకట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఏవిధమైన వ్యూహాలను అనుసరిస్తుందో చూడాలి మరి.
0 Comments