Ad Code

స్టేటస్‌ వీడియో సమయం పెంచిన వాట్సాప్‌ ?


వాట్సాప్‌ iOS యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను స్టేటస్‌లుగా పోస్టు చేయవచ్చు. ప్రస్తుతం ఈ టెస్టంగ్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ఆధారంగా WABetainfo ఈ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ iOS 24.10.10.74 బీటా వెర్షన్‌లో ఉంది. దీని ద్వారా గరిష్ఠంగా ఒక నిమిషం పాటు వాట్సాప్‌ స్టేటస్‌ను అప్‌లోడ్‌ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్‌లోనూ టెస్టింగ్‌ చేశారు. ప్రస్తుతం iOS బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకసారి 30 సెకన్లపాటు మాత్రమే స్టేటస్‌ వీడియో పోస్టు చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఒక నిమిషం పాటు స్టేటస్‌ వీడియోలను పోస్ట్‌ చేయవచ్చు. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ Wabetainfo నుంచి ఇటీవల వచ్చిన నివేదిక ఆధారంగా కెమెరాల కోసం జూమ్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంత మంది iOS బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కెమెరా పనితీరు మెరుగుపడుతుందని భావిస్తుంది. దీంతోపాటు అదనపు ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతోంది. బీటా టెస్టర్‌ లకు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్‌తో వారంతా జూమ్ లెవల్‌ను మార్చుకొనేందుకు అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu