* అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరించాలని నిర్ణయం
* ఎంఎస్‌పీ కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ చెల్లించకూడదని నిర్ణయం
* రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యం అంతా రాష్ట్రంలోనే సేకరిస్తాం
* సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్
* నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు
* ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.600 కోట్లు కేటాయింపు
* అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ
* కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయాలని నిర్ణయం. మంత్రివర్గంలో మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా చర్చించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనలకనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. ''మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే.. సరి అవుతుందన్న గ్యారెంటీ లేదని, నీరు నిల్వ చేసే పరిస్థితి కూడా లేదని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ చెప్పింది. అందుకే, తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసైనా సరే రైతులకు నీరు ఇవ్వాలని భావిస్తున్నాం'' అన్నారు.

0 Comments