Ad Code

ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో నయా మోసం !


ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో ఓ లింక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ మెసేజ్‌లో ‘మీ ఎస్‌బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి, తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి'. దీంతో పాటు ఎస్‌బీఐ యోనో పేరుతో ఓ లింక్‌ను యాడ్‌ చేసి పంపిస్తున్నారు. ఈ లింక్‌ను క్లిక్‌ చేయగానే.. ప్రొఫైల్‌ ఫొటో, పేరు ఎస్‌బీఐగా మారిపోతున్నాయి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్‌ కూడా ఎస్‌బీఐ హెల్ప్‌లైన్‌ అంటూ వస్తుండటంతో ఎస్‌బీఐ అధికారికంగా పంపిన మెసేజ్‌గానే భావిస్తున్నారు. మన ప్రమేయం లేకుండానే వాట్సాప్‌ నుంచి ఇదే మెసేజ్‌ వాట్సాప్‌ గ్రూప్‌ల్లోకి ఫార్వర్డ్‌ అవుతున్నాయి. దీంతో కొందరు ఈ లింక్‌ను క్లిక్‌ చేసి డబ్బులు కోల్పోతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రివార్డ్స్‌ పాయింట్‌ పేరుతో వచ్చే మెసేజ్‌లను గుడ్డిగా నమ్మకూడదని చెబుతున్నారు. అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌లోకి వెళ్లి నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. ఇలానే ఎస్‌బీఐ రివార్డ్‌ పేరుతో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయడంతో రూ. 50 వేలు కోల్పోయిన సంఘటన తెలంగాణలోని నిర్మల్‌లో చోటుచేసుకుంది.

Post a Comment

0 Comments

Close Menu