వివో నుంచి త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ X ఫోల్డ్ 3 ప్రో విడుదల కానుంది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ లైవ్ పేజీతోపాటు వివో టీజర్‌ను కూడా విడుదల చేసింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్ కలర్ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌తో ఉంది. చైనాలో ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. భారత్ వేరియంట్‌పై సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ 8.03 అంగుళాల ప్రధాన డిస్‌ప్లే, 6.53 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కస్టమ్ Vivo OS ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 4nm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎడిటింగ్ టూల్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో లాంచ్ కానుందని సమాచారం. దీంతోపాటు ఈ వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 100W వైర్. 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు కనెక్టివిటీ పరంగా వైఫై 7, బ్లూటూత్ 5.4, NFC, USB-C వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం.
0 Comments