మే 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు వివో ఇండియా ప్రకటించింది. టీజర్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ సిల్క్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 695 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని వివో వెల్లడించింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. కెమెరా కీలక ఫీచర్లను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), యాంటీ షేక్ కెమెరా సహా నైట్ ఫొటోగ్రఫీ, పొర్ట్రెయిట్ వంటి ఫీచర్లతో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ వివో V29e అప్‌డేటెడ్ వెర్షన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. 6.78 అంగుళాల పుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 రీఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1300 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత Funtouch 13, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. OIS సపోర్టుతో 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 8GB ర్యా్మ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యా్మ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
0 Comments