Ad Code

డిస్ని+ పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై నియంత్రణ ?


డిస్ని+ పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై నియంత్రణ విధించనుంది. హౌస్‌హోల్డ్‌ మినహా ఇతరులకు పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఎప్పుటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనే సమాచారం కూడా తెలిసింది. ఈ సంవత్సరం జూన్‌ నుంచి డిస్ని + పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపేస్తున్నట్లు తెలిసింది. ఇదివరకు మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ఈ తరహా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో డిస్ని+ లాభాలను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా.. జూన్‌లో కొన్ని దేశాల్లో ఈ నిర్ణయం తొలుత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పాస్‌వర్డ్‌ షేరింగ్‌ నిలిపివేత నిర్ణయాన్ని పక్కాగా అమలుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ నిలిపివేత కారణంగా కొత్తగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొనేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయితే హౌస్‌హోల్డ్‌ సభ్యులకు కాకుండా ఇతరులను పాస్‌వర్డ్‌ షేరింగ్ చేసేందుకు అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఎంత చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు వెల్లడి కాలేదు. డిస్ని ఇటీవల డిస్ని+ మరియు హులూ యాప్‌ను ప్రారంభించింది. ఈ రెండు ప్లాట్‌ఫాంల ద్వారా యూజర్లకు మరింత ఎక్కువ కంటెంట్‌ లభిస్తుంది. మరియు రెండు ఫ్లాట్‌ఫాంల కంటెంట్‌ హిస్టరీ కూడా పరస్పరం అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం చివరి నాటికి డిస్ని+ లాభాల్లోకి వస్తుందని భావిస్తోంది.డిస్ని+ జూన్‌ 2024 లో కొన్ని దేశాల్లో ఈ పాస్‌వర్డ్ షేరింగ్‌ నియంత్రణ నిర్ణయం అమల్లోకి తీసుకురానుంది. సెప్టెంబర్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు చేయాలని భావిస్తోంది. అయితే భారత్‌లో ఎప్పటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనే సమాచారం అందుబాటులో లేదు.

Post a Comment

0 Comments

Close Menu