భారతీ ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే ప్రీపెయిడ్ ప్లాన్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ల అన్‌లిమిటెడ్ 5G డేటాతోపాటు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్లాన్‌ల ధరలు రూ.359 నుంచి రూ.1,499 ధరల మధ్య ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు మీకోసం. ఎయిర్‌టెల్ రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ లో రీఛార్జి చేయించుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతోపాటు రోజూవారీ 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ Xstream ప్లే సహా OTT ప్లాట్‌ఫాంలను యాక్సెస్ పొందవచ్చు. రూ.399 తో రీఛార్జ్ చేయడం ద్వారా 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఇందులో భాగంగా రోజుకు 3G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ రోజుకు 100 SMS లు పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ Xstream ప్లే ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మరియు OTT ప్లాన్లను వినియోగించుకోవచ్చు. రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 3GB డేటాను పొందుతారు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లు చొప్పున వినియోగించుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. డిస్ని + హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.699 ప్లాన్‌ల ద్వారా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. ఇతర ప్రయోజనాలతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా పొందవచ్చు. 56 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు రూ.839 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్ Xstream ప్లే ను 3 నెలలపాటు మినీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలలపాటు మరియు మినీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రూ.999 రీఛార్జి ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. రోజువారీ రూ.2.5GB డేటాను పొందవచ్చు. మరియు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను 84 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. రూ.1499 రీఛార్జి ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో 3GB రోజువారీ డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMSలను పొందవచ్చు. మరియు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
0 Comments