Ad Code

దేశంలో రూ.6000 నుంచి రూ.8000 మధ్య ఫోన్లకు డిమాండ్ !


మొబైల్‌ ఫోన్ల వినియోగం సహా డేటా వినియోగంలో ప్రపంచ దేశాలలో పోలిస్తే భారత్‌ ముందు వరుసలో ఉంది. అయితే భారత్‌లో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఫలితంగా మిడ్‌రేంజ్ ఫోన్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాలు సహా చిన్న పట్టణాల్లో ఇప్పటికీ ఫీచర్‌ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ ఫోన్లకు మారే వారి సంఖ్య కూడా భారీగా ఉంటుంది. సైబర్‌ మీడియా రీసెర్ట్ కీలక నివేదికను విడుదల చేసింది. అనేక కారణాలతో ఫీచర్ల ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారుతున్నారని అయితే వారంతా చాలా వరకు రూ.6000 నుంచి 8000 మధ్య ఉన్న స్మార్ట్‌ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. సైబర్‌ మీడియా రీసెర్చ్‌ సంస్థ ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌, వారణాసి, నాసిక్‌, పాట్నా, భోపాల్‌, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో సుమారు 2000 మంది ఫోన్‌ వినియోగదారులను నుంచి వివరాలు సేకరించింది. ఈ వివరాలతో నివేదికను విడుదల చేసింది. నాణ్యమైన కెమెరా లేకపోవడం, ఇంటర్నెట్‌ను సౌకర్యవంతంగా వినియోగించుకోలేకపోవడం, ఎక్కువ యాప్‌లు వినియోగించే అవకాశం లేకపోవడం సహా అనేక కారణాలతో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 75 శాతం మంది ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు రూ.6 వేల నుంచి రూ.8 వేల మధ్య ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులు రోజుకు సగటున 3 గంటలపాటు కాల్స్‌, మెసేజ్‌ ఇతర ఫీచర్లపై గడుపుతున్నారు. మరియు మూడింట ఒక వంతు మంది వినియోగదారులు వాతావరణ, వార్తలు, సోషల్‌ మీడియా వంటి యాప్‌లను వినియోగిస్తున్నారు. యూపీఐ వంటి యాప్‌లు కలిగిన ఫీచర్‌ ఫోన్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. అయితే అందులో చాలా మంది మరిన్ని మెరుగైన ఫీచర్ల కోసం తక్కువ ధరలోని 4G, 5G సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తంగా మూడొంతుల మంది స్మార్ట్‌ఫోన్‌లకు మారేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో అనేక సంస్థ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల పైన ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. రూ.10 వేల కంటే తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తున్నారు. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలతోపాటు ఇతర సంస్థలు కూడా ఎంట్రీ లెవల్‌, మిడ్‌రేంజ్‌ పైన దృష్టిపెట్టాయి.

Post a Comment

0 Comments

Close Menu