రెడ్‌మీ ఈ ఏడాది ప్రాంరభంలో రెడ్‌మీ వాచ్ 4 పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ వాచ్‌కు అప్‌టేడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ వాయిస్ కంట్రోల్ ఫీచర్ సహాయంతో యూజర్లు అలారమ్ సెట్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే అటోమేషన్ డివైజ్‌లను ఆపరేట్ చేసుకోవచ్చు. రిమైండర్స్‌తో పాటు మరెన్నో చేసుకోవచ్చు. ఇందులో 1.97 ఇంచెస్‌తో కూడిన రెక్టాంగులర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఈ వాచ్‌లో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లూడ్ ఆక్సిజన్ వంటి హెల్త్ ఫీచర్లతో పాటు 150కిపై స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ను అందించారు. గైరోస్కోప్, జీపీఎస్ ఫంక్షనాలిటీ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్‌బుల్ట్‌గా స్పీకర్‌ను అందించారు. 5 ఏటీఎమ్ వాటర్ రెసిస్టెన్స్ ఈ వాచ్ సొంతం. అలాగే ఇందులో 470 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది.
0 Comments