Ad Code

4 నుంచి వన్ ప్లస్ నోర్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ అమ్మకాలు !


దేశీయ మార్కెట్లో వన్ ప్లస్ నోర్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్  విడుదలైంది.  వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్ ని రూ. 24,999 స్టార్టింగ్ ధరతో విడుదల చేసింది.  8GB + 128GB వేరియంట్ ను ఈ రేటు తో లిస్ట్ చేసింది. ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ని రూ. 26,999 ధరతో లాంఛ్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అంధుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను వేగవంతమైన Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో అందించింది. ఈ ప్రోసెసర్ ని వన్ ప్లస్ ట్రినిటీ ఇంజన్ తో జత చేయడం ద్వారా మంచి పెర్ఫార్మన్స్ కి హామీ ఇస్తోంది. 8GB RAM + 8GB అధనపు RAM ఫీచర్ తో కలిపి టోటల్ 16GB RAM ఫీచర్ తో అందించింది. ఈ ఫోన్ లో హెవీ 256GB UFS 3.1 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ ను మరియు ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ 1TB వరకూ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 2160Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్ మరియు Amazon Prime Video HDR సపోర్ట్ వంటి ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో రెండు Sony సెన్సార్లు కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సిస్టం ను అందించింది. ఇందులో 50 MP Sony LYT600 + 8 MP Sony IMX355 అల్ట్రా వైడ్ సెన్సార్లు కలిగి ఉంటుంది. కెమెరా EIS మరియు OIS సపోర్ట్ తో వస్తుంది. ఇది 4K video, సూపర్ స్లో మోషన్ వంటి మరిన్ని ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో ముందు 16 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. 100W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది. ఈ ఫోన్ లో Hi-Res, Hi-Res wireless మరియు నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి వుంది.

Post a Comment

0 Comments

Close Menu