Ad Code

రెడ్‌మి నోట్‌ 13 టర్బో స్మార్ట్‌ఫోన్‌ త్వరలో విడుదల ?


రెడ్‌మి నోట్‌ 13 టర్బో స్మార్ట్‌ఫోన్‌  త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది.  ఇది క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ తోపాటు OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. అయితే చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా పోకో బ్రాండ్‌పైన లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్‌ లీక్‌ చేసిన వివరాల ఆధారంగా ఈ రెడ్‌మి నోట్‌ 13 టర్బో హ్యాండ్‌సెట్ 1.5K OLED స్క్రీన్‌తోపాటు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 90W వైరడ్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 సెన్సార్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే మిగిలిన కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 20MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు రెడ్‌మి నోట్‌ 12T మరియు రెడ్‌మి నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ తరహా డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. గత సంవత్సరం రెడ్‌మి నోట్‌ 12 టర్బో చైనాలో లాంచ్‌ అయింది. అదే ఫోన్‌ భారత్‌లో పోకో F5 పేరుతో విడుదల అయింది. ప్రస్తుతం తర్వాత వెర్షన్‌ రెడ్‌మి నోట్‌ 13 టర్బో గా చైనాలో లాంచ్‌ కానుంది. భారత్‌ సహా ఇతర దేశాల్లో పోకో F6 గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ప్రస్తుత లీక్‌ల ఆధారంగా ఒకే తరహా స్పెసిఫికేషన్లు కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.




Post a Comment

0 Comments

Close Menu