Ad Code

12న ఇన్ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ సిరీస్ లాంచ్‌ !


దేశీయ మార్కెట్లో  ఏప్రిల్‌ 12న ఇన్ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ సిరీస్ లాంచ్‌ కానుంది. తొలిసారిగా ఈ ఫోన్ Cheetah X1 చిప్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ సెట్‌ మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని సంస్థ పేర్కొంది. ఈ ఫోన్‌ 6.78 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1500Hz ఇన్‌స్టంట్‌ టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో లాంచ్‌ కానుంది. ఈ డిస్‌ప్లే ద్వారా మెరుగైన విజువల్ అనుభూతిని పొందవచ్చని సంస్థ చెబుతోంది. నోట్ 40 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు ప్రీమియం డిజైన్‌, ప్రీమియం వెగాన్‌ లెదర్, గ్లాస్‌ ఫినిష్‌తో లాంచ్ కానుంది. 55 డిగ్రీల గోల్డెన్‌ కర్వేచర్ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్‌ ఫోన్లు స్టైల్‌ మరియు మన్నికను అందిస్తాయి. ఈ ఇన్ఫినిక్స్‌ 40 ప్రో సిరీస్ X1 Cheetah ఛార్జింగ్‌ చిప్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ పనితీరు డ్యామేజీ కాకుండా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను అందిస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ Muti Mode ఫాస్ట్‌ ఛార్జ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మూడు ఛార్జింగ్‌ మోడ్‌లు, హైపర్‌ ఛార్జ్‌తో వస్తుంది. నోట్‌ 40 ప్రో+ ను 8 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు. నోట్‌ 40 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే నోట్‌ 40 ప్రో+ 100W ఛార్జింగ్‌ సపోర్టుతో 4600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు 20W వైర్‌లెస్‌ MagCharge సపోర్టును కలిగి ఉంటాయి. దీంతోపాటు కార్నింగ్ గ్లాస్‌ రక్షణను కలిగి ఉంటాయి. వింటేజ్‌ గ్రీన్‌ మరియు టైటాన్‌ గోల్డ్ రంగుల్లో లభిస్తాయి. స్మార్ట్‌ ఫోన్లు వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. 3x జూమ్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 108MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu