Ad Code

చాట్‌ లిస్ట్‌లోనే UPI QR స్కానర్‌ ?


వాట్సాప్‌ చాట్ లిస్ట్‌ నుంచే యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంత మంది ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉందని తెలుస్తోంది. త్వరలో అందరికీ అందుబాటులో రానుంది. వినియోదారులకు మెరుగైన సౌకర్యలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ Wabetainfo నివేదిక అనుగుణంగా వాట్సాప్‌ చాట్‌ లిస్ట్‌లో నేరుగా UPI QR కోడ్ స్కానర్‌ (Whatsapp UPI QR Scanner) అందుబాటులో ఉంటుంది. ఫలితంగా యూజర్లు సులభంగా పేమెంట్లు చేయగలుగుతారు. ఈ ఫీచర్‌ కారణంగా సమయం సహా యూజర్లకు మెరుగైన అనుభూతి కలగనుంది. వాట్సాప్‌ ప్రొఫైల్‌లను స్క్రీన్‌షాట్‌ తీసే అవకాశం ఉండదు. వాట్సాప్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను వినియోగిస్తున్న వారికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోను స్క్రీన్‌షాట్‌ తీసేందుకు ప్రయత్నం చేస్తే.. వ్యక్తిగత సమాచారం కారణంగా స్క్రీన్‌షాట్‌ తీసేందుకు అనుమతి లేదనే పాప్‌అప్‌ వస్తోంది. అనేక మంది వాట్సాప్‌ వినియోగదారులు ముఖ్యంగా మహిళలు తమ ఫొటోలను వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫోటోలుగా పెట్టుకొనేందుకు ఆసక్తి ఉన్నా.. వివిధ భద్రతా కారణాల రీత్యా వెనక్కి తగ్గుతున్నారు. ఆయా ఫోటోలను స్క్రీన్‌షాట్‌ తీసి చెడు మార్గాల్లో వినియోగిస్తారనే ఆందోళనతో వాట్సాప్‌ ప్రొఫైల్ ఫోటోలుగా తమ ఫొటోలను వినియోగించడం లేదు. తాజాగా విడుదలైన ఫీచర్‌తో ఆ ఆందోళనలకు చెక్‌ పెట్టినట్లు అయింది. వాట్సాప్ సంస్థ ప్రకారం ప్రతి చాట్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. చాటింగ్ సమయంలో ఇందుకు సంబంధించి ఎటువంటి సింబల్‌ లేదా లేబుల్‌ కనిపించదు. అయితే త్వరలో ఇందుకు సంబంధించి లేబుల్‌ చాట్‌ స్క్రీన్‌పైన కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉందని వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu