దేశీయ మార్కెట్లో పోకో C61స్మార్ట్ ఫోన్ ను విడుదలైంది. ఇది కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో వచ్చింది. ఇప్పటికే C Series నుండి చాలా ఫోన్ లను అందించిన పోకో ఇప్పుడు ఈ కొత్త ఫోన్ ను బడ్జెట్ ధరలో తగిన ఫీచర్స్ తో విడుదల చేసింది. పోకో సి61 స్మార్ట్ ఫోన్ 4 GB + 64 GB వేరియంట్ ను రూ. 7,499, 6 GB + 128 GB వేరియంట్ ను రూ. 8,499 ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ మార్చి 28వ తేది నుండి ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో లాంఛ్ అయ్యింది. ఇది ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ లో కెమేరా సెటప్ చుట్టూ పెద్ద రింగ్ డిజైన్ తో ఉంటుంది. ఈ పోకో కొత్త ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ మరియు Gorilla Glass 3 రక్షణ కలిగిన 6.71 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ Mediatek బడ్జెట్ ప్రోసెసర్ Helio G36 తో పని చేస్తుంది. అలాగే, 6GB వరకూ ర్యామ్ మరియు 128GB వరకూ స్టోరేజ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఇందులో, 8MP మెయిన్ కెమేరా వుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈఆ ఫోన్ లో చాలా కెమేరా ఫిల్టర్లతో పాటుగా 1080p (30fps) వీడియో రికార్డ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ లో Bluetooth Version v5.4 సపోర్ట్ వుంది మరియు ఈ ఫోన్ లేటెస్ట్ Android 14 OS తో నడుస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 10 W Type-C చార్జ్ సపోర్ట్ వుంది. సెక్యూరిటీ పరంగా పోకో C61 ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించింది.
0 Comments