ఎయిర్‌టెల్ రూ. 699 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 3 జీబీ 4జీ డేటాతో పాటు 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ ఐపీఎల్ సీజన్ అంతటా నిరంతరాయంగా స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. అనుకూలమైన స్మార్ట్‌ఫోన్‌లలో కాంప్లిమెంటరీ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత 5 జీ డేటా యాక్సెస్‌తో వస్తుంది. దీనితో పాటు అదనపు డేటా అవసరమైన వారికి ఎయిర్‌టెల్ రూ. 29 నుంచి డేటా టాప్-అప్ ప్లాన్‌లను అందిస్తుంది.
జియో రూ. 444 రీఛార్జ్ ప్లాన్ 100 జీబీ డేటాతో 60 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే రూ. 667 రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో 150 జీబీ డేటాను అందిస్తుంది. అదనంగా జియో ఫెస్టివల్ ఆఫర్ అయిన రూ. 999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కింద రోజుకు 3 జీబీ 4జీ డేటాతో పాటు అపరిమిత 5జీ యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే ప్లాన్ చెల్లుబాటు 84 రోజులు. అలాగే జియో రూ. 399 ధరతో నెలవారీ రీఛార్జ్ ఎంపికను కలిగి ఉంది. ఈ ప్లాన్‌లో అదనంగా 6 జీబీ డేటాను అంటే రోజుకు 3 జీబీ 4జీ డేటాను పొందవచ్చు.
వీఐ ఐపీఎల్ ఔత్సాహికుల కోసం కొన్ని ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్ ఎంపికలను అందిస్తుంది. రూ.699 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 56 రోజుల వాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. దీనితో పాటు సబ్‌స్క్రైబర్‌లు 12 ఏఎం నుండి 6 ఏఎం వరకు అపరిమిత 4 జీబీ డేటాను పొందవచ్చు. అలాగే వీఐ లు, టీవీ సభ్యత్వాలను కూడా పొందవచ్చు. అదనపు డేటా అవసరమయ్యే వినియోగదారులు వీఐ రూ. 475 రీఛార్జ్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఇది 28 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 4 జీబీ డేటాను అందిస్తుంది. దీనికి అదనంగా వీఐ 1.5 జీబీ డేటా కోసం రూ. 25 నుంచి డేటా వోచర్‌లను అందిస్తుంది. ప్రత్యామ్నాయంగా, వినియోగదారులు 56 రోజుల పాటు 100 జీబీ డేటాను అందించే రూ. 418 డేటా ప్లాన్‌తో ప్రాథమిక రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
0 Comments