జియో 5జీ మొబైల్ కి పోటీగా ఎయిర్ టెల్ కూడా పోకోతో కలిసి 5జీ మొబైల్ ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. పోకో మొబైల్ సంస్థ ఇండియా అధినేత హిమాన్షు టాండన్ దేశంలోని సరికొత్త బడ్జెట్లో 5జి మొబైల్ ని లాంచ్ చేయబోతున్నట్లు తన ట్విట్టర్ లో మార్చి 5వ తేదీన ప్రకటించారు. ఎయిర్ టెల్ ని తమ భాగస్వామిని చేసుకున్నట్లుగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. పోకో గత ఏడాది జులైలో poco C51 పేరుతో ఎయిర్ టెల్ ప్రత్యేకమైన వేరియంట్ ను సైతం రిలీజ్ చేసింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్ కూడా అందిస్తున్నామంటూ తెలియజేశారు. అలాగే ఎయిర్టెల్ నుంచి పలు రకాల ప్రత్యేక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటారని వెల్లడించారు. ఈ హ్యాండ్ సెట్ మీడియా టెక్ హీలియో G36 SOC పైన ఆధారపడి పని చేస్తుందని బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యంతో ఉంటుందని ఎయిర్టెల్ భాగస్వామ్యంలో భాగంగా ఈ రాబోయే మొబైల్ POCO XAIRTEL గా రాబోతోందని వెల్లడించారు. ఈ మొబైల్ ఇండియాలోనే లాంచ్ చేయబడిన అత్యంత చౌకైనా 5g మొబైల్ గా ఉండబోతోందని తెలిపారు. గతంలో కూడా ఎయిర్టెల్ కోసం ప్రత్యేకమైన ఫోను విడుదల చేశారని..POCO C-51 పేరుతో ఈ మొబైల్ ని విడుదల చేయక దీని ధర 8,500 కలదు.. ఆ తర్వాత దీని అని జులై నెలలో ఎయిర్టెల్ ఎక్స్ క్లూజివ్ వర్షన్ లో 6000 రూపాయలకే లాంచ్ చేసింది.
0 Comments