రెండేండ్ల క్రితం టెక్నాలజీ రంగంలో సంచలనం నెలకొల్పిన చాట్‌బోట్ 'చాట్ జీపీటీ' పేరెంట్ సంస్థ ఓపెన్ఏఐ లో ఎలన్ మస్క్ పెట్టుబడులు పెట్టారు. 2015లో మానవులకు లబ్ధి చేకూరుస్తుందన్న పేరుతో ప్రారంభించిన నాన్ ఫ్రాఫిట్ సంస్థ 'ఓపెన్ ఏఐ' తనతో చేసుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నదంటూ ఎలన్ మస్క్ ఆరోపణలు చేశారు. ఓపెన్ఏఐ శామ్ ఆల్టమన్, తదితరులపై శాన్ ఫ్రాన్సిస్కోలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో నాన్ ఫ్రాఫిట్ సంస్థగా రిజిస్టర్ చేసుకున్న ఓపెన్ ఏఐ' ఇప్పుడు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఎలన్ మస్క్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ స్పందించేదు.2015లో ఎలన్ మస్క్ సహా వ్యవస్థాపకుడిగా ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టినా 2018లో నిధులను ఉపసంహరించుకున్నారు.
0 Comments