Ad Code

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్ల అమ్మకం ?


దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బ్లూ చిప్ కంపెనీ టాటా సన్స్ అనుబంధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).ఇందులో 2.34 కోట్ల వాటాలను విక్రయించి నిధులు సమకూర్చుకోవాలని టాటా సన్స్ తలపోస్తునట్లు తెలుస్తోంది. ఒక షేర్ విలువ రూ.4,001 ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులు తెలిపారు. ఈ షేర్ల విక్రయానికి సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్ బ్యాంకులను టాటా సన్స్ నియమించినట్లు సమాచారం. టీసీఎస్‌లో తన వాటాల విక్రయం ద్వారా సుమారు రూ.9,362 కోట్ల (1.13 బిలియన్ డాలర్లు) నిధులు సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. టీసీఎస్‌లో టాటా సన్స్ సంస్థకు 72.38 శాతం వాటాలు ఉంటాయని 2023 డిసెంబర్ 31 గణాంకాల ప్రకారం తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో టీసీఎస్‌లో తన వాటాలో 0.65 శాతం షేర్లను విక్రయించాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇలా వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను రుణాల చెల్లింపునకు ఉపయోగించాలని టాటా సన్స్ తల పోస్తున్నది. అలాగే టాటా సన్స్ తన కార్పొరేట్ వ్యవస్థలో సమూల మార్పులు తేవాల్సి ఉంది. 2017లో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ అధ్యక్షుడిగా తొలగించి ఎన్ చంద్రశేఖరన్‌ను నియమించినప్పుడు సంస్థను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటా సన్స్ లిస్టింగ్ కావడానికి 2025 సెప్టెంబర్ వరూ సమయం పడుతుంది. ఇదిలా ఉంటే, గత డిసెంబర్ నెలలో టీసీఎస్ తన షేర్ల బైబ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా షేర్ విలువ రూ.4,150 చొప్పున రూ.17 వేల కోట్ల నిధులు సేకరించింది. ఇదిలా ఉంటే టీసీఎస్‌లో తమ వాటాల విక్రయంపై టీసీఎస్ గానీ, జేపీ మోర్గాన్ గానీ, సిటీ గ్రూప్ గాని స్పందించేందుకు నిరాకరించాయి.

Post a Comment

0 Comments

Close Menu