2500కి పైగా వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న 'ఎక్స్' ఖాతాలకు ఉచితంగా ప్రీమియం సేవలు అందిస్తామని ఎలన్ మస్క్ అన్నారు. 5000 మందికి పైగా ఫాలోవర్లు గల 'ఎక్స్' యూజర్లకు ఉచితంగా ప్రీమియం ప్లస్ సేవలు అందుబాటులోకి తెస్తామని 'ఎక్స్ (మాజీ ట్విట్టర్)' వేదికగా తెలిపారు. కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు మెరుగైన ఫీచర్లు అందించడానికే ఎలన్ మస్క్ ఈ ఫెసిలిటీని కల్పించారని సమాచారం. ఇప్పటికే 'ఎక్స్' తన యూజర్లకు ప్రీమియం, ప్రీమియం + ఫీచర్లు అందిస్తున్నది. యూజర్ల సబ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ మేరకు ప్రీమియం ప్లస్ యూజర్లు ప్రకటనల్లేకుండా 'ఎక్స్' ఖాతా పొందడంతోపాటు పోస్ట్ చేసిన గంటలోపు సదరు ట్వీట్ ఎడిట్ చేయొచ్చు. 25 వేల అక్షరాల వరకూ పోస్ట్ చేయొచ్చు. ప్రీమియం, ప్రీమియం+ సబ్ స్క్రిప్షన్ గల యూజర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ (ఎక్స్ఏఐ' డెవలప్ చేసిన ఏఐ చాట్ బోట్ గ్రోక్'ను యాక్సెస్ చేయొచ్చు. ఇప్పటి వరకూ నెలకు రూ.1300 పే చేసే ప్రీమియం ప్లస్ యూజర్లకే గ్రోక్ ఫీచర్ యాక్సెస్ అవకాశం ఉండేది. ఇన్ స్టాగ్రామ్, యూ-ట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో యూజర్లను ఆకర్షించడానికి ప్రీమియం, ప్రీమియం+ సబ్ స్క్రైబర్లకు ఈ ఫీచర్లను యాక్సెస్ చేసుకునే సౌకర్యం కల్పించాలని ఎలన్ మస్క్ నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఎక్స్ (ట్విట్టర్) వాణిజ్య ప్రకటనల ఆదాయం తగ్గుతున్నట్లు, రోజురోజుకు 'ఎక్స్' యూజర్లు తగ్గిపోతున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ఎలన్ మస్క్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.
0 Comments