Ad Code

వాచ్‌లా మారిపోతున్న స్మార్ట్ ఫోన్‌లు ?


స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 నుంచి వస్తున్న ఆవిష్కరణపై టెక్ ప్రియులు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ అంతర్జాతీయ టెక్ ఈవెంట్‌లో టెక్ దిగ్గజాలైన మోటోరోలా, సామ్‌సంగ్ వారి ‘బెండబుల్ ఫోన్’ ప్రోటోటైప్‌లకు సంబంధిత వెర్షన్‌ల ప్రదర్శనపై వస్తున్న ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మోటరోలా గత ఏడాది అక్టోబర్‌లో వెల్లడించిన అడాప్టివ్ డిస్‌ప్లే కాన్సెప్ట్‌నకు సంబధించిన వర్కింగ్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. కాన్సెప్ట్ ఫోన్ రిస్ట్ బ్యాండ్ లాగా మడిచే అవకాశం ఉంటుంది. దీన్ని రిస్ట్ వాచీలాగా మణికట్టు చుట్టూ ధరించవచ్చు. ప్రోటోటైప్‌లో 6.9 అంగుళాల ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ ఆధారిత పోలెడ్ డిస్‌ప్లే ఉంది. శామ్‌సంగ్ కూడా చేతి చుట్టూ ధరించగలిగే దాని ఫోల్డబుల్ ఫోన్ ప్రోటోటైప్‌ను కూడా ప్రదర్శించింది. కంపెనీ దీనికి ‘ఓఎల్ఈడీ క్లింగ్ బ్యాండ్’ అని పేరు పెట్టింది. మోటోరోలా ప్రోటోటైప్ ఫోన్‌లా ఓఎల్ఈడీ క్లింగ్ బ్యాండ్ కూడా 6.9 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే ఫ్లాట్‌గా ఉన్నప్పుడు బెండబుల్ ఫోన్‌లు రెండూ సాధారణ స్మార్ట్‌ఫోన్స్‌లా కనిపిస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఎండబ్ల్యూసీ 2024లో ప్రదర్శించిన ప్రోటోటైప్‌లు ప్రస్తుతానికి చాలా ఆచరణాత్మకంగా కనిపించడం లేదు. ఎందుకంటే ఫోన్‌లను పదే పదే వంచడం వల్ల ఫ్లెక్సిబుల్ స్క్రీన్‌పై చిన్న పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ కాన్సెప్ట్‌లు కేవలం ఆలోచనల దశలోనే ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu