దేశీయ మార్కెట్‌లోఈ నెల 5వ తేదీన విడుదలైన నథింగ్ ఫోన్ 2a సత్తా చాటింది. మార్చి 12వ తేదీ మధ్యా్హ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. సేల్ ప్రారంభం అయిన తొలి 60 నిమిషాల్లో 60,000 స్మార్ట్ విక్రయించినట్లు సంస్థ వెల్లడించింది. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందనపై నథింగ్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది. అయితే నథింగ్ సంస్థ తొలిసారిగా బడ్జెట్ రేంజ్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత మోడళ్ల మాదిరిగానే ట్రాన్సపరెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక కీలక ఫీచర్లతో విడుదల అయింది. నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్ ధర రూ.25,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. బ్లాక్ మరియు వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ 2aను HDFC బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కూడా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉండనుంది. 12 నెలల వరకు నోకాస్ట్ EMI సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
0 Comments