ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా త్రీడీ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో ఓ కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఫోన్‌లో త్రీడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే హైలైట్‌గా నిలుస్తోంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. హెచ్‌డీఆర్ 10, హెచ్‌డీఆర్ 10+ డిస్ ప్లేలను కూడా సపోర్ట్ చేస్తుంది. లావా బ్లేజ్ కర్వ్ 5జీ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్, ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెప్తోంది. కెమెరాల విషయానికొస్తే.. ఇందులో వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్ కెమెరాలున్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 32ఎంపీ కెమెరా ఉంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు, బ్లూటూత్ 5.2, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్లున్నాయి. కెమెరాకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. ధరల విషయానికొస్తే.. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.17,999, 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉన్నాయి. ఐరన్ గ్లాస్, విరిడియన్ గ్లాస్ రంగుల్లో లభిస్తుంది. మార్చి 14 నుంచి లావా ఇ-స్టోర్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో కొనుగోలు చేయొచ్చు.
0 Comments