ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త మోడల్ S1X 4Kwh పేరిట కొత్త స్కూటర్ ను ఆవిష్కరించింది. ఈ మోడల్ స్కూటర్ లో అత్యధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 198 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని ప్రారంభ ధరను రూ. 1.99లక్షలుగా ప్రకటించింది. ఈ వెహికిల్ 3.3 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగానికి పుంజుకుంటుంది. గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 6కేడబ్ల్యూ సామర్థ్యంతో ఉండే మోటార్ 8బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ లాంటి మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. తమ ఉత్పత్తులు, చార్జింగ్ నెట్ వర్క్, బ్యాటరీ వారంటీలపై అన్ని అడ్డంకులు అధిగమిస్తూ ముందుకు వెళుతున్నామని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అండ్ ఎండీ భవిష్ అగర్వాల్ చెబుతున్నారు. తమ ఉత్పత్తులు ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాలు /80,000కిలోమీటర్ల వరకూ వారంటీ అందిస్తున్నామని, అదనంగా 5000 చెల్లిస్తే లక్ష కిలో మీటర్ల వరకు వారంటీ ఉంటుందని చెప్పారు.
0 Comments