దేశీయ మార్కెట్లోకి మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ విడుదలైంది. ఈ టూవీలర్‌కు లైసెన్స్ కూడా అవసరం లేదని కంపెనీ తెలిపింది. సింగిల్ చార్జ్‌తో 120 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 49,999కే లభించనుంది. ప్రస్తుతం రెండు వేరియంట్లలోనే ఈ బైక్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. 5 రంగులలో ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. పెద్ద టైర్ సైజులతో ఈ కొత్త తరం బైక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్‌లో భారీ బ్యాటరీ ప్యాక్ ఉండటమే కాదు, దీనిని 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. 25 ఎంపీహెచ్ వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ బైక్‌లో 36 V/20 Ah బ్యాటరీ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. బైక్ మొత్తం బరువు కేవలం 40 కిలోలు మాత్రమే. మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ చక్రాలు చూసినట్లైతే రెండు టైర్లలో డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఈ బైక్ పెద్ద సైజులో 20 అంగుళాల చక్రాలతో ఉంది. ఈ బైక్‌ను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదని కంపెనీ తెలిపింది. ఈ గేర్ లెస్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం చూస్తే గంటకు 25 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లగలదు. కాబట్టి దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని కంపెనీ తెలిపింది. నగరం లేదా సిటీల్లో వారి అవసరాలకు ఈ బైక్ బాగా ఉపయోగపడుతుంది.
0 Comments