వాట్సాప్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చినట్లు వాట్సాప్ కలర్, థీమ్ ను మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ వాట్సాప్ ను ఆకుపచ్చ, నీలం, తెలుపు, కోరల్, పర్పుల్ రంగులలో మార్చుకునే అవకాశాన్ని కలుగుతుంది. WABetaInfo ప్రకారం ఈ ఫీచర్ ఐవోఎస్ వాట్సాప్ బీటా వెర్షన్ 24.1.10.70లో కనిపించింది. బీటా వెర్షన్లో తీసిన స్క్రీన్ షాట్ లో, వినియోగదారులు ఐదు కలర్ ఆప్షన్లు పొందవచ్చని తెలుస్తోంది. వాట్సాప్ థీమ్ కస్టమైజేషన్ ఫీచర్ సాయంతో వినియోగదారులు వాట్సాప్ కలర్ను మార్చగలరు. ఈ ఫీచర్ కారణంగా వాట్సాప్ మొత్తం రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలు వాట్సాప్ ను ఒకే థీమ్, కలర్ లో ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కొత్త కలర్, థీమ్ వినియోగదారులకు ఒక కొత్త తరహా అనుభవాన్ని ఇవ్వనుంది. వాట్సాప్ మరో కొత్త ఫీచర్పై కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. దీని పేరు బబుల్ కలర్ చేంజ్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు పర్సనలైజేషన్ ను పొందుతారు. అంటే వినియోగదారులు తమకు నచ్చినట్లు వాట్సాప్ ను ఉపయోగించుకోగలుగుతారు. వాట్సాప్ ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్లన్నింటిపై పనిచేస్తోంది. ఈ కలర్ ఫీచర్లతో పాటు వాట్సాప్ 2024లో అనేక ఇతర ప్రత్యేక మార్పులను చేయనుంది. రాబోయే కాలంలో వినియోగదారులు వాట్సాప్ ఛాట్ల ఉచిత అపరిమిత బ్యాకప్ ను పొందలేరు. ఇది ఇప్పటివరకు గూగుల్ డిస్క్ ద్వారా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులకు వారి గూగుల్ డ్రైవ్ లో ఎంత ఖాళీ స్థలం ఉందో అంతే ఉచిత వాట్సాప్ బ్యాకప్ చేసుకోవచ్చని కంపెనీ నిర్ణయించింది. అంటే గూగుల్ డ్రైవ్ లో అందుబాటులో ఉన్న 15 జీబీ ఉచిత స్టోరేజ్లో మాత్రమే వాట్సాప్ చాట్ బ్యాకప్ ఉండనుంది. మీ గూగుల్ అకౌంట్లో ఖాళీ స్పేస్ అయిపోతే, మీరు గూగుల్ వన్ నుంచి స్టోరేజ్ ను కొనుగోలు చేయాల్సి వస్తుంది.
0 Comments