జనవరి 9న బజాజ్ నుంచి చేతక్ -Ev కొత్త ఎడిషన్ మార్కెట్లోకి రాబోతోంది. కొత్త రివైజ్డ్ చేతక్ EV బైక్ అడ్వాన్సుడ్ మెకానిక్స్ వంటి అప్ గ్రేడ్ తో ఈ బైక్ రాబోతోంది. టాప్ ఎండ్ చేతక్ బైక్ సరికొత్త వేరియంట్ తో విడుదల చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ పెద్ద బ్యాటరీ అడ్వాన్సుడ్ ఫీచర్స్ తో ఆకట్టుకునే విధంగా వుంది. బజాజ్ చేతక్ బైక్ 3.2 Kwh బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. సింగిల్ చార్జింగ్ తో 127 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బ్యాటరీ బ్యాకప్ కంటే ఇది అప్ గ్రేడ్ వర్షన్ అని చెప్పవచ్చు. పాత బ్యాటరీలు ఒకసారి చార్జింగ్ చేస్తే 113 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తారు. అయితే ఈ బజాజ్ కొత్త చేతక్ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ సున్నా నుంచి 100% చార్జింగ్ పూర్తి అవ్వడానికి 4:30 నిమిషాలు మాత్రమే పడుతుంది. గతంలో బైక్స్ టాప్ స్పీడ్ 63 kmph, కానీ ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 73 కిలోమీటర్ల వేగంతో ఉంటుందట. ఈ చేతక్ బైక్ సరికొత్త స్క్రీన్ తో కూడా రాబోతోందట. Lcd యూనిట్ ఇన్ స్ట్రుమెంట్ తోTFT స్క్రీన్ ని కలిగి ఉంటుంది. అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్ట్ సరికొత్త ఫీచర్స్ తో ఈ చేతక్ బైక్ రాబోతోంది. అండర్ సీటు కింద 21 లీటర్ల వరకు గ్యాప్ ని పెంచినట్లుగా సమాచారం.
0 Comments