దేశీయ మార్కెట్లోకి ఐటెల్ ఏ70 పేరుతో కొత్త ఫోన్‌ను జవనరి 5న తీసుకొస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్రిలియంట్ గోల్డ్, ఫీల్డ్ గ్రీన్, స్టైలిష్ బ్లాక్, అజూర్ బ్లూ కలర్స్‌లో లభించనున్నాయి. అమెజాన్‌తో పాటు పలు రిటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేతో స్క్రీన్‌లో ప్రత్యేకంగా డైనమిక్ బార్‌ను అందిస్తున్నారు. దీంతో యూజర్లకు నోటిఫికేషన్స్‌కు సంబంధించి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. టైప్‌సీ ఛార్జింగ్ పోర్ట్ ఈ ఫోన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన హెచ్‌డీఆర్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. ఫేస్ అన్‌లాక్‌తో పాటు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఈ ఫోన్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐటెల్ ఏ70 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,299కాగా, 4 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,799గా ఉంది. ఇక 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ విషయానికొస్తే రూ.7,299గా నిర్ణయించారు. ఫోన్ కొనుగోలు చేసే సమయంలో ఎంపిక చేసిన పలు బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
0 Comments