క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తమ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను జోడించారు. ఇకపై ఓలా యూజర్లు నేరుగా తమ యాప్‌లోనే డిజిటల్ పేమెంట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ విషయాన్ని కో ఫౌండర్ సీఈఓ భవీశ్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో ఇకపై ఓలా యూజర్లు నేరుగా తమ యాప్ నుంచే పేమెంట్స్ చేసుకోవచ్చు. సాధారణంగా ఓలా నుంచి క్యాబ్ చేసుకుంటే.. పేమెంట్ మోడ్‌లోకి వెళ్లి, మనీ వ్యాలెట్ లేదా క్యాష్ ద్వారా పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ డిజిటల్ పేమెంట్ చేయాలంటే.. ఇతర యూపీఐ సేవల ద్వారా చేసుకోవాల్సి ఉండేది. అయితే ఇకపై థార్డ్ పార్టీ యూపీఐ యాప్ అవసరం లేకుండానే ఓలా యాప్ ద్వారానే పేమెంట్ చేసుకోవచ్చు. దీంతో ఇప్పటి వరకు బుకింగ్ మాత్రమే పరిమితమైన ఓలా యాప్ ద్వారా ఇకపై పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే ఓలా యాప్‌లో యూపీఐ పేమెంట్స్ ఫీచర్‌ను జోడించారు. దీంతో యాప్ ద్వారా నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చని కంపెనీ చెబుతోంది. ఓలా తొలుత ఈ ఫీచర్‌ను బెంగళూరు వాసులకు అందుబాటులోకి తీసుకురానుంది. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లలందరికీ సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
0 Comments