యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ కొన్ని లావాదేవిలపై పరిమితులను పెంచినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పునరావృత చెల్లింపుల కోసం ఇ-ఆదేశాలకు కొత్త పరిమితులను కూడా ప్రకటించారు . కొత్త యూపీఐ లావాదేవి పరిమితి నియమాల ప్రకారం, వ్యక్తులు నిర్దిష్ట చెల్లింపుల కోసం మునుపటి రూ. 1 లక్షకు బదులుగా రూ. 5 లక్షల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు చెల్లింపు కోసం ఒక్కో లావాదేవీకి లక్ష నుండి రూ. 5 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించామని, ఇది విద్య, వైద్య రంగంలో ప్రయోజనాల కోసం అధిక మొత్తంలో చెల్లింపు చేసే వినియోగదారులకు సహాయపడుతుందని శక్తికాంత్ దాస్ తెలిపారు.
0 Comments