Ad Code

జాబిల్లి నుంచి భూకక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌ !


చంద్రయాన్​-3 ప్రాజెక్ట్​లో భాగంగా జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు​ తెలిపారు. చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్న ఇస్రో, తాజా ప్రయోగం ఆ మిషన్​కు దోహదపడుతుందని పేర్కొంది. నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్​లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంది. కాగా, చంద్రయాన్-3 మిషన్​ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్​ ఈ ఏడాది ఆగస్టు 23న సాఫ్ట్​ ల్యాండింగ్ చేసింది. 'విక్రమ్​ ల్యాండర్'​, 'ప్రజ్ఞాన్​ రోవర్‌'ల సాయంతో దీనిని పూర్తి చేశారు. దీంతో చందమామ సౌత్​ పోల్​పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్​ నిలిచింది.

Post a Comment

0 Comments

Close Menu