Ad Code

ఐఫోన్లలో విజువల్ లుక్ అప్ ఫీచర్‌ !


ఫోన్లలో ఇప్పుడు 'విజువల్ లుక్ అప్' ఫీచర్‌ యాడ్ అయింది. దీని సాయంతో  కారులో ఏవైనా సమస్యలను వెంటనే గుర్తించవచ్చు. iOS 17లోని ఈ కొత్త ఫీచర్‌తో ఐఫోన్లు ఇప్పుడు కారు డ్యాష్‌బోర్డ్‌లోని ఐకాన్స్ గుర్తించగలుగుతున్నాయి, వాటి అర్థం ఏంటో వాహనదారులకు చిటికెలో తెలుపుతున్నాయి. చాలా మంది కారు యజమానులు కారు స్పీడోమీటర్ పక్కన కనిపించే ఐకాన్స్‌ చూసి గందరగోళానికి గురవుతారు. కొన్నిసార్లు ఈ ఐకాన్స్‌ వెలిగి, కారులో ఏదో లోపం ఉందని సూచిస్తాయి. కానీ వాటి అర్థం ఏంటి? కారును వెంటనే మెకానిక్ వద్దకు తీసుకెళ్లాలా? లేదా వాటిని పట్టించుకోకుండా డ్రైవింగ్ కొనసాగించవచ్చా? అని చాలామంది సందేహాలతో సతమతమవుతుంటారు. iOS 17 అప్‌డేట్స్ ఈ ప్రశ్నలకు చెక్ పెడతాయి. ఐఫోన్, ఫొటోస్‌ యాప్‌తో ఆ ఐకాన్స్‌/సింబల్స్ అర్థం ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు.  ఐఫోన్ iOS 17కి అప్‌డేట్ చేసుకోవాలి. ఐఫోన్ కెమెరాతో కారు డాష్‌బోర్డ్ ఫొటో తీయాలి. ఐఫోన్‌లోని ఫొటోస్‌ యాప్‌లో ఫొటోను ఓపెన్ చేయాలి.  టూల్‌బార్ కింద ఉన్న స్టీరింగ్ వీల్ ఐకాన్‌పై నొక్కాలి. స్క్రీన్‌పై ఐకాన్స్, వాటి అర్థాల లిస్ట్‌ కనిపిస్తుంది. తద్వారా కారులో ఉన్న లోపం ఈజీగా తెలుసుకోవచ్చు.

ఐఫోన్ ఫొటోను విశ్లేషించడానికి, సంబంధిత సమాచారాన్ని కనుగొనడానికి విజువల్ లుక్ అప్ ఫీచర్‌ని ఉపయోగిస్తుంది. ఈ సమాచారాన్ని ఐఫోన్‌లోని సఫారీ బ్రౌజర్ నుంచి తీసుకుంటుంది. ఫీచర్ డ్యాష్‌బోర్డ్ వార్నింగ్ లైట్లు, క్లైమేట్ కంట్రోల్ ఐకాన్స్‌, డీఫ్రాస్టింగ్ సింబల్స్ వంటి వాటిని గుర్తించగలదు. దీనివల్ల వాహనదారులు కారు ఫీచర్లు, ఫంక్షన్లను బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కారు యజమానులకు చాలా ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. ఇది ప్రమాదకరమైన కారుతో డ్రైవింగ్ చేయకుండా కూడా ఆపుతుంది. ఈ ఫీచర్ ఎన్ని కారు మోడళ్లతో పనిచేస్తుందో తెలియ రాలేదు. ఫోన్ తయారీదారులందరూ యూజర్లకు ఈ గొప్ప ఫీచర్ అందిస్తే చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద ఐఫోన్లు పాకెట్-ఫ్రెండ్లీ కారు మెకానిక్‌గా కూడా పనిచేస్తూ ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu