క్లియర్‌ఫేక్ అనేది ఒక రకమైన డీప్‌ఫేక్ ఇది మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించి ఇమేజ్‌లు లేదా వీడియోలను వాస్తవంగా కనిపించేలా మార్చడానికి రూపొందించారు. ఇమేజ్ స్ప్లికింగ్, ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్ సింథసిస్ వంటి అనేక పద్ధతులను ఉపయోగించడం ద్వారా దీన్ని చేయవచ్చు. ఇది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి నకిలీ వార్తలను సృష్టించడానికి, అలాగే అసలైన వ్యక్తుల్లా కనిపించడానికి ఉపయోగించవచ్చు. సైబర్ థ్రెట్ అలర్ట్ సిస్టమ్‌ల ప్రొవైడర్ అయిన మాల్‌వేర్‌బైట్స్, క్లియర్‌ఫేక్ టెక్నిక్ ద్వారా హ్యాకర్లు మ్యాక్ యూజర్‌లకు ఏఎంఓఎస్ సోకేలా చేస్తున్నారని వివరించారు. క్లియర్ ఫేక్ గురించి విండోస్ దాడుల్లో మొదట గుర్తించారు. క్లియర్‌ఫేక్ హ్యాక్ చేసిన వెబ్‌సైట్‌ల ద్వారా నకిలీ సఫారీ, క్రోమ్ బ్రౌజర్ నవీకరణలను ప్రచారం చేస్తుంది. హైజాక్ చేసిన వెబ్‌సైట్‌ల ద్వారా విస్తరిస్తున్న నెట్‌వర్క్‌ను ఉపయోగించడం ద్వారా ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్‌ను డౌన్‌లోడ్ చేసే వినియోగదారుల నుంచి సున్నితమైన డేటాతో పాటు లాగిన్ ఆధారాలను తస్కరిస్తున్నారు. ఈ వివరాలతో భవిష్యత్‌లో దాడులకు లేదా తక్షణ ఆర్థిక ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఏఎంఓఎస్ దాని లక్ష్యాల నుంచి డేటాను దొంగిలించే ఒక రకమైన మాల్వేర్-క్లియర్‌ఫేక్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. దాడి చేసేవారు ప్రమాదకరమైన జావా స్క్రిప్ట్ కోడ్‌ను కల్పిత వెబ్‌సైట్‌లలోకి ప్రవేశపెడుతున్నారు. ఒక వ్యక్తి అలాంటి పేజీని యాక్సెస్ చేసిన తర్వాత వారు అధికారిక సఫారీ లేదా క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్‌లుగా కనిపించే తప్పుడు ప్రాంప్ట్‌లను పొందుతారు. ఈ నోటిఫికేషన్‌లు ఉద్దేశపూర్వకంగా వినియోగదారులను క్లిక్ చేయడం కోసం రూపొందింలచారు. దీని వలన హానికరమైన ఏఎంఓఎస్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అవుతుంది. అయితే దీన్ని నుంచి రక్షణ పొందాలంటే తెలియని మూలాల నుండి సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయకపోవడం మంచిది. యాప్ నుంచి నేరుగా సఫారీ, క్రోమ్‌ను అప్‌డేట్ చేయాలి. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందు యాప్ సోర్స్‌పై అవగాహనతో ఉండాలి.
0 Comments