ఇన్‌స్టాగ్రామ్‌లో నచ్చిన రీల్స్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లోడ్ ఆప్షన్ తీసుకొచ్చింది. పబ్లిక్ అకౌంట్స్‌లో అప్‌లోడ్ అయిన రీల్స్‌ను యూజర్లు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అకౌంట్లలోని రీల్స్‌కు ఇది వర్తించదు. రీల్స్ డౌన్‌లోడ్ ఫీచర్‌కు కొన్ని షరతులు ఉన్నాయి. డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోల్లో ఇన్‌స్టాగ్రామ్ వాటర్‌మార్క్‌తో పాటు యూజర్‌నేమ్, ఆడియో ఆట్రిబ్యూషన్లు ఉంటాయి. అలాగే ఆ వీడియోలను కమర్షియల్ యాక్టివిటీస్‌కు వాడుకునేందుకు పర్మిషన్ లేదు. తమ రీల్స్‌ని ఇతరులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చా? లేదా? అన్నది యూజర్లే డిసైడ్ చేసుకోవాలి. రీల్ అప్‌లోడ్ చేసేముందు 'సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ'లో 'ప్రైవసీ' ఆప్షన్‌కు వెళ్లి అక్కడ 'షేరింగ్ అండ్ రీమిక్స్'పై క్లిక్ చేయాలి. అక్కడ 'ఎలో డౌన్‌లోడింగ్ యువర్ రీల్స్' ఆప్షన్ ఆన్‌లో ఉంచితే ఇతరులు రీల్స్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది. లేకపోతే లేదు. యూజర్లు రీల్స్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు రీల్ వీడియో పక్కన ఉన్న షేర్ బటన్ నొక్కాలి. అక్కడ కనపించే డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి వీడియో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 'ఆడియో బ్రౌజర్' పేరుతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఆప్షన్ ద్వారా ట్రెండింగ్‌లో ఉన్న ఆడియోలను ఈజీగా సెర్చ్ చేసి వాడుకోవచ్చు. అలాగే వీడియోలను ఎడిట్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఎడిటర్ టూల్ కూడా రానుంది. ఈ ఫీచర్‌తో వీడియోలను రొటేట్, ట్రిమ్, స్కేలింగ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఫొటో ఫిల్టర్స్, ఏఐ స్టికర్స్, ఫాంట్ స్టైల్ ఛేంజ్ వంటి ఫీచర్లపై కూడా ఇన్‌స్టా్గ్రామ్ పనిచేస్తుంది.
0 Comments