Ad Code

జియో మోటివ్‌ ఆవిష్కరణ !


జియోతో టెలికాం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించిన రియలన్స్‌, ఫైబర్‌ నెట్‌తో పాటు శాటిలైట్‌ నెట్‌తో ఇంటర్‌నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక జియో క్లౌడ్‌, జియో టీవీ ఇలా ఎన్నో అధునాతన సేవలు అందిస్తున్న రిలయన్స్‌ జియో.. తాజాగా మరో అద్భుతానికి తెర తీసింది. తాజాగా మార్కెట్లోకి జియో మోటివ్‌ పేరుతో ఓ అధునాతన డివైజ్‌ను లాంచ్‌ చేసింది. ‘డ్రైవ్‌ కనెక్టెడ్‌, డ్రైవ్‌ స్మార్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో తీసుకొచ్చిన ఈ డివైజ్‌ సహాయంతో కారు భద్రతకు భరోసా కల్పిస్తోంది. తక్కువ ధరలోనే అందుబాటలోకి వచ్చిన ఈ డివైజ్‌ను చాలా సింపుల్‌గా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా డ్రైవర్లకు కార్లు ఇచ్చే యజమానులకు ఈ డివైజ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. 4జీ జీపీఎస్ ట్రాకర్‌, రియల్ టైమ్‌ లొకేషన్‌ ట్రాకింగ్, టైమ్‌ ఫెన్సింగ్‌, వెహికిల్ హెల్త్‌, తెఫ్ట్‌ అలర్ట్‌, యాస్టిడెంట్‌ డిటెక్షన్‌, వైఫై హాట్‌స్పాట్‌ వంటి ఫీచర్లను అందించారు. దీంతో ఓనర్లు తమ కారు కండిషన్‌ ఎలా ఉందో డ్రైవర్లకు పదేపదే డ్రైవర్లకు ఫోన్‌ చేయకుండానే కారు కండిషన్‌ తెలసుకునే అవకాశం కల్పించారు. కారులో ఎలాంటి సమస్య తలెత్తిన వెంటనే కారులోని డ్రైవర్‌తో పాటు యజమానికి కూడా అలర్ట్ చేస్తుంది. ఈ-సిమ్‌ కార్డుతో పనిచేసే ఈ డివైజ్‌ను వైఫై హాట్‌స్పాట్‌గానూ ఉపయోగించుకోవచ్చు. ఈ డివైజ్‌ను కారులోని ఓబీడీ పోర్ట్‌కు కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవాలి. దీంతో ఎప్పటికప్పుడు కారుకు సంబంధించిన వివరాలను మీ స్మార్ట్ ఫోన్‌కు నోటిఫికేషన్ల రూపంలో అందిస్తుంది. కారు లొకేషన్‌ వివరాలను అందిస్తూ మీరు కారును స్మార్ట్‌గా మార్చేస్తుందీ పరికరం. జియో థింగ్స్‌ యాప్‌తో ఈ కారుకు సంబంధించిన వివరాలను 24/7 ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డ్రైవర్‌ కారును ఏ వేగంతో నడిపిస్తున్నాడు లాంటి వివరాలను కూడా అందిస్తుంది. ఇక ఈ డివైజ్‌ ధర విషయానికొస్తే రూ. 4999కాగా ఈ సేవలు పొందడానికి ప్రతీ ఏటా రూ. 599 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఏడాది సేవలు ఉచితంగా అందిస్తారు. ఒకవేళ కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్లినా, హార్ష్‌ బ్రేకింగ్‌లు వేసినా వెంటనే డ్రైవర్‌తో పాటు యజమానికి అలర్ట్ వెళుతుంది.

Post a Comment

0 Comments

Close Menu