యూట్యూబ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి కొత్త జనరేటివ్ ఏఐ ఫీచర్‌లను డెవలప్ చేస్తోంది. ఈ అడ్వాన్స్‌డ్ ఆప్షన్లను ముందుగానే ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశాన్ని సెలక్టెడ్ యూజర్లకు అందించింది. కొత్త ఫీచర్లలో ఎక్స్‌టెన్సివ్ కామెంట్ థ్రెడ్స్‌తో యూట్యూబ్ వీడియోల కామెంట్స్ కేటగరైజ్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తుంది. ఈ AI-బేస్డ్ టూల్ కామెంట్స్‌ని థీమ్స్ లేదా టాపిక్స్‌గా విభజిస్తుంది. యూజర్లు ఈజీగా డిస్కషన్స్‌లో పాల్గొనే సదుపాయం కల్పిస్తుంది. అంతేకాకుండా, కంటెంట్ క్రియేటర్లు ఈ కామెంట్ సమ్మరీల ద్వారా ఆడియన్స్‌తో సులువుగా ఎంగేజ్ కావచ్చు. కంటెంట్ కోసం ఫ్రెష్ ఇన్‌స్పిరేషన్ కనుగొనడానికి ఉపయోగించుకోవచ్చు. కామెంట్ టాపిక్స్ అప్పటికే పబ్లిష్ అయిన కామెంట్స్ ఆధారంగానే జనరేట్ అవుతాయి. రివ్యూ కోసం వెయిటింగ్‌లో ఉన్న, బ్లాక్ చేసిన పదాలతో ఉన్న కామెంట్స్‌ను పరిగణించవు. వీడియో కంటెంట్ గురించి మరింత అర్థవంతమైన చర్చలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఫీచర్ వస్తోంది. రెండో ఫీచర్‌గా కన్వర్జేషనల్ ఏఐ టూల్‌ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఈ స్మార్ట్ AI వ్యూవర్స్‌కి వారు చూస్తున్న వీడియోకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను అందిస్తుంది. బ్యాక్‌గ్రౌడ్ ఇన్‌ఫర్మేషన్, రిలేటెడ్ కంటెంట్‌ని సూచించడం వంటివి చేస్తుంది. వీడియో ప్లేబ్యాక్‌కు అంతరాయం కలగకుండా టూల్‌ను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ వీడియోల కోసం క్విజ్‌లు, రెస్పాన్స్‌లను ప్రొవైడ్ చేసేలా ఏఐని డిజైన్ చేశారు. ఇది కంటెంట్‌పై లోతైన అవగాహనను అందిస్తుంది. ఈ ఇన్నోవేటివ్ ఫీచర్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా యూట్యూబ్ యూజర్లకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి. కొంత మంది సెలక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. యాక్సెస్ ఉన్నవారికి ఐడెంటిఫై చేసేలా స్టాక్ ఐకాన్ కనిపిస్తుంది. అంతే కాకుండా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కు కూడా ఈ కొత్త ఫీచర్ల యాక్సెస్ ఉంటుంది. గూగుల్ వర్క్‌స్పేస్ వినియోగదారుల కోసం కమ్యూనికేషన్‌ను క్రమబద్ధీకరిస్తోంది. గతంలో వర్క్‌స్పేస్ వినియోగదారులు వీడియో కాల్స్ కోసం మీటింగ్ లింక్స్ క్రియేట్ చేసి, ఇమెయిల్ లేదా చాట్ ద్వారా క్యాలెండర్ ఇన్వైట్స్ పంపాల్సి ఉండేది. ఇప్పుడు మీట్ మొబైల్ యాప్ ద్వారా నేరుగా 'క్లౌడ్-ఎన్‌క్రిప్టెడ్ 1:1 వీడియో కాల్స్' ఆప్షన్ ఇవ్వడం ద్వారా గూగుల్ ప్రాసెస్‌ను ఈజీగా మార్చింది.
0 Comments