Ad Code

సీఈవోగా శామ్‌ ఆల్ట్‌మాన్‌ తిరిగి బాధ్యతల స్వీకరణ !


పెన్‌ ఏఐ సీఈవోగా శామ్‌ ఆల్ట్‌మాన్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఓపెన్‌ ఏఐలో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్‌ సంస్థ డైరెక్టర్ల బోర్డులో చేరింది. నాన్‌ ఓటింగ్‌ అబ్జర్వర్‌గా చేరింది. అంటే ఓపెన్‌ ఏఐ సంస్థ బోర్డు సమావేశాలకు మైక్రోసాఫ్ట్‌ హాజరవుకావచ్చు మరియు వారి రహస్య సమాచారాన్ని యాక్సెస్‌ చేయవచ్చు. అయితే బోర్డు తీసుకొనే నిర్ణయాలలో ఓటు వేసే హక్కు లేదు. మైక్రోసాఫ్ట్‌ బోర్డులో చేరడంపై ఓపెన్‌ ఏఐ సంస్థ ఉద్యోగులకు మెమో ద్వారా సీఈవో శామ్‌ ఆల్ట్‌మాన్‌ తెలియజేశారు. సంస్థలోని ఉద్యోగుల పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ లక్ష్యాలను చేరుకోవడం సహా ఉద్యోగుల విజయానికి ఎక్కువ అవకాశాలున్నాయని శామ్‌ ఆల్ట్‌మాన్‌ తెలిపారు. ఓపెన్ ఏఐ సీఈవోగా శామ్‌ ఆల్ట్‌మాన్‌ తిరిగి నియామకం జరిగాక, మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ ఏఐ సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వారు చేసిన కృషిపై ప్రశంసలు కురిపించారు. ఏఐపై పనిచేసినందుకు రెండు సంస్థల ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లేందుకు మరియు ఏఐ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. సేల్స్‌ఫోర్స్‌ మాజీ కో- సీఈవో బ్రెట్‌ టేలర్‌, అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్‌, కోరా సీఈవో ఆడమ్‌ డీ ఏంజీలో ఓపెన్‌ ఏఐ కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ఓపెన్‌ ఏఐ నుంచి తొలగింపు అనంతరం శామ్ ఆల్ట్‌మాన్‌కు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల మద్దతుగా నిలిచినట్లు వార్తలు వచ్చాయి. దాంతోపాటు సంస్థ ఇన్వె్స్టర్లు ఆల్ట్‌మన్‌ వైపు నిలిచారు. ఓపెన్‌ ఏఐ సీఈవోగా శామ్‌ ఆల్ట్‌మాన్‌ను తొలగించిన అనంతరం.. ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడుగా ఉన్న గ్రెగ్‌ బ్రోక్‌మాన్‌ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే అనంతరం వారిద్దరినీ మైక్రోసాఫ్ట్‌ అడ్వాన్సడ్‌ ఏఐ రీసెర్ట్‌ టీంలోకి తీసుకుంటున్నట్లు సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. వారికి కావాల్సిన అన్ని వనరులను సమకూర్చుతామని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu