గతం వారం రోజులుగా ఓపెన్ ఏఐ సంస్థలో నడుస్తున్న పరిణామాలకు తెరపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మాన్ తిరిగి ఓపెన్ ఏఐ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతోపాటు ఓపెన్ ఏఐ సంస్థ నూతన డైరెక్టర్ల బోర్డును నియమించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ X వేదికగా ప్రకటన చేశారు. ఓపెన్ ఏఐ అంటే తనకెంతో ఇష్టమని ఆల్ట్‌మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంస్థ లక్ష్యం కోసం గత కొన్ని రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఓపెన్ ఏఐకి తిరిగొచ్చి మైక్రోసాఫ్ట్‌తో బంధాన్ని నిలిపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. సేల్స్‌ఫోర్స్ మాజీ కో- సీఈవో బ్రెట్ టేలర్, అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, కోరా సీఈవో ఆడమ్ డీ ఏంజీలో ఓపెన్ ఏఐ సంస్థ కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ఓపెన్ ఏఐ నుంచి తొలగింపు అనంతరం శామ్ ఆల్ట్‌మాన్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మద్దతుగా నిలిచినట్లు వార్తలు వచ్చాయి. దాంతోపాటు సంస్థ ఇన్వె్స్టర్లు ఆల్ట్‌మన్ వైపు నిలిచినట్లు తెలుస్తోంది. దాంతోపాటు సంస్థ ఉద్యోగుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థలోకి తిరిగి వచ్చేందుకు ఆల్ట్‌మాన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత బోర్డును తొలగింపు సహా తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని షరతులు విధించినట్లు తెలుస్తోంది. సంస్థ కూడా ఆల్ట్‌మాన్ షరతులను అంగీకరించినట్లు సమాచారం.
0 Comments