కేరళకు చెందిన వెర్సికల్స్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ సంస్థ డిజిటల్ హెల్త్ కియోస్క్ అనే సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించింది. షుగర్, బీపీ, హార్ట్ అటాక్ సమస్యలను తక్షణమే గుర్తించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. దీంతో గంటల తరబడి డయోగ్నోస్టిక్ సంస్థలపై ఆధారపడాల్సి పనిలేదు. దీనిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించినట్లు తెలిపారు. తక్కువ ధరకే దీనిని అందిస్తామంటోంది ఈ సంస్థ. అయితే నిర్థిష్టమైన ధరను ప్రకటించలేదు. ఇప్పటికే తమ సంస్థ వైర్‌లెస్ బ్లాటూత్ థర్మామీటర్, బాడీ వెయింగ్ మిషన్, ఈసీజీ మానిటరింగ్ డివైజ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీంతోపాటూ వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పూర్తి డేటాను చాలా కాలంపాటూ ఇందులో భద్రపరిచి ఉంచవచ్చు. టచ్ స్క్రీన్ ఉంటుంది. ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. రకరకాల భాషల్లో సూచనలు ఇస్తుంది. ప్రాధమిక నిర్థారణ పరీక్షలు క్షణాల్లో తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు. చికిత్సకు సంబంధించిన వివరాలు సూచిస్తుంది. దీనిని ఎక్కడైనా సులువుగా అమర్చవచ్చు.
0 Comments